Aug 18,2022 07:56

 అంగీకరించిన ఇజ్రాయిల్‌
జెరూసలెం :
గాజాపై గతవారం చేసిన వైమానిక దాడుల్లో చివరి రోజున ఐదుగురు పాలస్తీనా చిన్నారులను హత్య చేసినట్లు ఇజ్రాయిల్‌ నిస్సిగ్గుగా అంగీకరించింది. ఈ మరణాలకు ఇజ్రాయిల్‌ బాధ్యత వహించాలని ఆ దేశ సైనిక అధికారులు ధృవీకరించారు. ఈ నెల 7 జరిగిన ఈ దాడిపై సైనిక విచారణ జరగాలని అనేక మంది రక్షణ అధికారులు పేర్కొన్నట్లు స్థానిక వార్తాపత్రికలు తెలిపాయి. ఈ చిన్నారులు వారి తాత సమాధి వద్ద కూర్చుని ఉన్న సమయంలో దాడి జరగడంతో వారు అక్కడికక్కడే మరణించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.