
ప్రజాశక్తి-ఆదోనిరూరల్ (కర్నూలు) : మిరప పంట వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే పరిహారం అందించి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం జిల్లా అధ్యక్షులు కె.వెంకటేశులు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ముందు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాని ఉద్దేశిస్తూ నాయకులు మాట్లాడుతూ.. ఖరీఫ్‌లో ఆదోని మండలంలో దాదాపు 12వేల ఎకరాల్లో మిరప పంట సాగు చేశారన్నారు. అయితే అధిక వర్షాలు తామర పురుగు వల్ల మెరుపు పంట పూర్తిగా దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. కనీసం ఎకరాకు ఒక కింటం దిగుబడి వచ్చే పరిస్థితి లేదన్నారు. ప్రతి ఎకరాకు 15 నుండి 20 కింటాలు దిగుబడి రావాల్సి ఉంది ఎకరాకు దాదాపు లక్ష రూపాయల వరకు పెట్టుబడి రైతులు పెట్టినప్పటికీ కూలీలు ఖర్చు 20 వేల రూపాయలు కూడా రావడం లేదన్నారు. దీనివల్ల రైతులు అప్పుల పాలై కొంతమంది వలసలు పోతే మరి కొంతమంది పొలాలమ్ముకోవడం ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది కావున తక్షణమే బీమా పరిహారం అందించి మిరపరైతల్ని ఆదుకోవాలని అలాగే గత సంవత్సరంలో పెండింగ్లో ఉన్న బీమా పరిహారాన్ని కూడా తక్షణమే రైతుల అకౌంట్లో జమ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు సంఘం మండల కార్యదర్శి అయ్యప్ప,అధ్యక్షులు శేఖర్,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి లింగన్న,మండల కార్యదర్శి వీరారెడ్డి, కెవిపిఎస్ మండల కార్యదర్శి తిక్కప్ప,రైతు సంఘం నాయకులు మునిస్వామి, రవి, హనుమంతరెడ్డి, ఏలియా, భాష, రామలింగప్ప, పెద్దహరివానము, చిన్న హరివనము, సంతక్కుళ్ళూరు, దానాపురం, కల్లుబావి, పాండవగల్లు, కుప్పగల్లు, గణేకల్లు, మధిర, దొడ్డనగిరి, ఆరెకలు, హనువాళ్లు తదితర గ్రామాల రైతులు పాల్గొన్నారు.
ః