Mar 20,2023 12:04

ఇంటర్నెట్‌డెస్క్‌ : ఉగాది పండుగ సందర్భంగా ఈ వారం భారీ బడ్జెట్‌ చిత్రాలు థియేటర్‌లో విడుదలయ్యేందుకు సిద్ధమయ్యాయి. ఈ వారం మరికొన్ని చిత్రాలు ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమౌతున్నాయి. మరి ఆ చిత్రాలేంటో తెలుసుకుందామా..!

రంగమార్తాండ
ప్రముఖ డైరెక్టర్‌ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'రంగమార్తాండ'. ఈ చిత్రం మరాఠీ హిట్‌ మూవీ 'నట్‌సామ్రాట్‌'కి రీమెక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రంతో దర్శకుడు కృష్ణవంశీ రంగస్థల కళాకారుల జీవితాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం నంటించారు. అలాగే ఆస్కార్‌ అవార్డు గ్రహీత ప్రముఖ సింగర్‌ రాహుల్‌ సింప్లిగంజ్‌, హీరోయిన్‌ శివాత్మిక జంటగా తెరపై కనిపించనున్నారు. ఈ చిత్ర పోస్టర్‌తోనే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రం ఉగాది పండుగ సందర్భంగా మార్చి 22న థియేటర్‌లలో విడుదల కానుంది.

dhamki


ధమ్కీ
టాలీవుడ్‌ హీరో విశ్వక్‌సేన్‌, నివేదా పేతురాజ్‌ జంటగా నటించిన చిత్రం 'ధమ్కీ'. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన 'పాగల్‌' చిత్రం హిట్‌ కొట్టింది. మళ్లీ మరోసారి ఈ జంట తెరపై 'ధమ్కీ' చిత్రంతో అలరించేందుకు సిద్ధమైంది. నటుడు విశ్వక్‌సేన్‌ స్వీయ దర్శక్వతంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళ్‌, హిందీ, మలయాళం భాషల్లో పాన్‌ ఇండియా మూవీగా మార్చి 22వ తేదన థియేటర్‌లో విడుదల కానుంది. ఉగాది పర్వదినాన విడులయ్యే ఈ చిత్రంతో విశ్వక్‌సేన్‌ మరోసారి ప్రేక్షకులను ఏమేరకు అలరించనున్నాడో చూడాలి.

kosti


కోస్టి
ప్రముఖ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ నటించిన తాజా చిత్రం 'కోస్టి'. ఈ చిత్రం తమిళంలో 'ఘోస్టి' పేరుతో విడుదలకు సిద్ధమవుతుంది. ఈ చిత్రంలో కాజల్‌ ఇన్‌స్పెక్టర్‌ పాత్రలో నటించనున్నారు. హారర్‌ కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం మార్చి 22వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు కల్యాణ్‌ తెరకెక్కించారు.

getta sakshiga


గీత సాక్షిగా
నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కిన టాలీవుడ్‌ చిత్రం 'గీత సాక్షిగా'. ఈ మూవీని ఆంథోని మట్టిపల్లి డైరెక్ట్‌ చేశారు. చేతన్‌రాజ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపీ సుందర్‌ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రంలో శ్రీకాంత్‌ అయ్యంగార్‌, రూపేష్‌శెట్టి, భరణి శంకర్‌, జయలలిత, అనిత చౌదరి, రాజా రవీంద్ర వంటి నటీనటులు నటించారు. ఈ చిత్రం మార్చి 22న థియేటర్‌లో విడుదలై ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఓటీటీ

panchatantram


ఈటీవీ విన్‌
పంచతంత్రం

ఆహా
వినరో భాగ్యము విష్ణుకథ

vinaro bhagyamu vishnu katha