Nov 23,2022 18:56

బాస్‌ పార్టీ లిరికల్‌ వీడియో సాంగ్‌టాలీవుడ్‌ స్టార్‌ హీరో చిరంజీవి టైటిల్‌ రోల్‌ చేస్తున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. మాస్‌ ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి బాస్‌ పార్టీ సాంగ్‌ పూర్తి లిరికల్‌ వీడియోను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ పాటను డీఎస్పీ స్వయంగా రాసి కంపోజ్‌ చేయడం విశేషం. ఈ పాటను నకాశ్‌ అజీజ్‌, డీఎస్పీ, హరిప్రియ పాడారు. పాటలో చిరంజీవి లుంగీ పూర్తి మాస్‌ గెటప్‌లో కనిపించారు. బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌటేలా ఊరమాస్‌ స్టెప్పులతో అభిమానులకు కావాల్సిన వినోదాన్ని అందిస్తోంది. బాబీ (కేఎస్‌ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. వాల్తేరు వీరయ్య 2023 జనవరి 13న సంక్రాంతి కానుకగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.