
చిట్టి ఇంటి దగ్గర చిలుక వచ్చి వాలింది. 'నేను బడికి పోను' అని చిట్టి ఏడవ సాగింది.
'ఏడవకు చిట్టి ఏమైంది బడికి పోవడానికి'అని చిలుక చిట్టిని అడిగింది.
'ఏమి కాలేదు. ఎందుకో నాకు బడికి పోవాలనిపించడం లేదు. చక్కగా పొలానికి పోయి ఆడుకోవాలనిపిస్తుంది' అంది చిట్టి.
'ఇవాళ ఒక్కరోజే కదా బడి ఉండేది. రేపు ఎలాగూ ఆదివారం ఆడుకోవడమే కదా' అని అంది చిలుక. దాంతో ఆ రోజు స్కూలుకు వెళ్లి. ఆదివారం అంతా చిట్టి పొలంలో చిలుకతో ఆడుకో సాగింది. ఎండకు చిట్టికి దాహం వేసింది. పొలం అంటేనే చిరాకు అనిపించింది.
యధావిధిగా చిలుక సోమవారం చిట్టి దగ్గరకు వచ్చి వాలింది. అప్పుడూ బడికి వెళ్ళనని గోల చేసింది చిట్టి.' అసలు నీకు బడి అంటే ఎందుకు భయం?' అని చిలుక చిట్టిని చిన్నగా ఆరా అడిగింది.
'నాకు లెక్కలు అంటే భయం. ఆ సార్ నన్ను చూడగానే ఎక్కాలు చెప్పమంటారు' అని చిట్టి ఏడవ సాగింది .
'అయ్యో అంతేనా ఏడవకు..ఏడవకు' అంటూ చిలుక సముదాయించబోయింది.
' లెక్కల సారు ప్రతిరోజూ పది ఎక్కాలు అప్పచెప్పాలంటారు. నాకేమో ఏడెక్కమూ, తొమ్మిదో ఎక్కము రానే రావడం లేదు. అని అసలు విషయం చెప్పి బావుర్మంది చిట్టి.
'అంతేనా! దానికి ఏడవాలా కష్టం అనుకోకుండా ఇష్టపడి చదువు తప్పకుండా వస్తుంది. ఏడు ఎక్కమే కాదు ఇరవ ఎక్కాలు వస్తాయి. అని చిట్టికి ధైర్యం చెప్పింది చిలుక. చిలుక మాటలతో శ్రద్ధగా చదవ సాగింది. కాసేపట్లోనే ఏడెక్కం ్ట వచ్చేసింది. ఆ సంతోషంతో తొమ్మిదోఎక్కం కూడా వచ్చేసింది. అంతే ఎగిరి గంతేసింది.తొందరగా బడికి వెళ్లి చకచకా ఎక్కాలు చెప్పింది చిట్టి.
- అమ్మిన వెంకట అమ్మిరాజు
పేరూరు, వాజేడు(మం)ములుగు(జిల్లా)