
అమరావతి : ఏడో రోజు కొనసాగుతోన్న ఎపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశం రసాభాసగా మారింది. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కొట్టుకున్నారు. టిడిపి ఎమ్మెల్యే డోలా, వైసిపి ఎమ్మెల్యే సుధాకర్ బాబు మధ్య ఘర్షణ రాజుకుంది. స్పీకర్‌ను టిడిపి సభ్యులు చుట్టుముట్టడంతో కుర్చీలో నుంచి స్పీకర్ వెళ్లిపోయారు. టిడిపి సభ్యులపైకి ఎమ్మెల్యే సంజీవయ్య దూసుకెళ్లారు. సంజీవయ్యను మంత్రి అంబటి అడ్డుకున్నారు. టిడిపి, వైసిపి సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. జిఒ నెం.1 ను రద్దు చేయాలని టిడిపి సభ్యులు డిమాండ్ చేశారు.