
పరిశుభ్రత ముఖ్యము
పాటిస్తే లాభము
ఆరోగ్యం పదిలము
లేకుంటే శిథిలము
పరిసరాల శుభ్రత
మనందరీ బాధ్యత
వద్దు ఉదాసీనత
ముద్దు పరిశుభ్రత
తక్షణమే పూనుము
శ్రమదానం చేయుము
రోగాలిక మాయము
ఆరోగ్యం సొంతము
పెంచుము పచ్చదనము
పంచుము చక్కదనము
ఎంచుము జన క్షేమము
కొంచెము యత్నించుము
ఆరోగ్యం భాగ్యము
పరిశుద్దత సూత్రము
ఇక నడుంబిగించుము
స్వచ్ఛభారత్ కోరుము
- గద్వాల సోమన్న
99664 14580