Jun 22,2022 20:13

బుధవారం ఉదయం సినీ కార్మికులంతా ఫిల్మ్‌ ఫెడరేషన్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చమని నినాదాలు చేశారు. ఈ క్రమంలో సమ్మెపై నిర్మాతల మండలి స్పందించింది. బుధవారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించింది. 'కార్మికుల వేతనాలు పెంచడంలో తమకు ఎలాంటి ఇబ్బంది లేదు. రేపటి నుంచి కార్మికులంతా యథావిధిగా షూటింగ్స్‌లో పాల్గొనాలి. ఎప్పటిలాగా షూటింగ్స్‌కు వస్తే.. విధి విధానాలపై చర్చించి సమస్యను ఒక కొలిక్కి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం, లేదంటే.. నిర్మాతలెవరూ షూటింగ్స్‌ చేయడానికి సిద్ధంగా లేరు. నిర్మాతల్ని ఇబ్బంది పెట్టకండి. వారు సినిమాలు చేస్తేనే మనకు పని ఉంటుంది' అని ప్రముఖ సి. కళ్యాణ్‌ వివరించారు.