Aug 02,2022 12:40

ఇంగ్లండ్‌లో జరుగుతున్న కామన్‌వెల్త్‌గేమ్స్‌లో భారత సైక్లిస్ట్‌ మీనాక్షి తీవ్ర గాయాలపాలైంది. మహిళల 10 కిలోమీటర్ల స్క్రాచ్‌ రేసులో పాల్గొన్న ఆమె తన సైకిల్‌ అదుపుతప్పడంతో కిందపడిపోయింది. అదే సమయంలో ఆమె వెనుకే వస్తున్న న్యూజిలాండ్‌ సైక్లిస్ట్‌ బ్రయానీ బోథా మీనాక్షిని తప్పించలేక..ఆమెని తొక్కేసి.. తను కూడా పడిపోయింది. ఈ భయంకరమైన దృశ్యాన్ని చూసిన మెడిక్స్‌ వెంటనే రంగంలోకి దిగి మీనాక్షికి, బోథాలిద్దరినీ రేసు నుంచి పక్కకు తీసుకొచ్చి ప్రాథమిక చికిత్స అందించారు. మీనాక్షికి తీవ్రమైన గాయం కావడంతో ఆమెను స్ట్రెచర్‌పై తీసుకెళ్లారు.
కాగా, ఇలాంటి సంఘటనే కొన్నిరోజుల క్రితం పురుషుల సైక్లింగ్‌ ఈవెంట్‌లో కూడా జరిగింది. సైక్లిస్ట్‌ తన వేగాన్ని అదుపు చేసుకోలేక ప్రేక్షకుల్లోకి దూసుకెళ్లడంతో.. అక్కడున్న ప్రేక్షకుడికి తీవ్రంగా గాయమైంది. సైక్లిస్ట్‌ కూడా దెబ్బతిన్నాడు.