
విజయవాడ : జిఒ నెంబర్ 1 ను రద్దు చేయాలని ర్యాలీ చేస్తున్న పౌరహక్కుల ఐక్య వేదిక నాయకులను అరెస్టులు చేయడం గర్హనీయమని సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటి ఆగ్రహన్ని వ్యక్తం చేసింది. సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కార్యదర్శివర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు, విద్యార్ధి, యువజన సంఘాల నాయకులను అరెస్టు చేయడాన్ని సిపిఐ(ఎం) ఖండిస్తున్నదని స్పష్టం చేసింది. ఇప్పటికైనా ప్రభుత్వం ర్యాలీలు, సభలను నిషేధించే జిఒ నెంబర్ 1 ని రద్దు చేయాలని సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటి డిమాండ్ చేసింది.