Aug 18,2022 21:50

న్యూఢిల్లీ: ఆలిండియా ఫుట్‌బాల్‌ సమాఖ్యపై ఫిఫా నిషేధం, ఫిఫా అండర్‌-17 ప్రపంచకప్‌పై అనిశ్చితిపై తాజాగా సుప్రీంకోర్టు మరోసారి స్పందించింది. ముగ్గురు సభ్యులతో ఢిల్లీ హైకోర్టు ఓ కమిటీని ఏర్పాటు చేయాలంటూ ఆదేశాలు జారీచేసింది. ఆ నిర్ణయం ఆహ్వానించదగ్గ పరిణామమని ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌(ఐఓఏ) గురువారం పేర్కొంది. జాతీయ క్రీడల కోడ్‌లో వివాదాస్పద నిబంధనలు ఉన్నాయని, ప్రాథమికంగా అధికారులు, వారి పదవీకాల మార్గదర్శకాలు, ఐఓఏనుంచి ప్రపంచ ఒలింపిక్‌సమాఖ్యకు ఎన్నుకోబడ్డ వారి అధికారాలను తెలియపర్చాలని పేర్కొంది. ఫుట్‌బాల్‌ వంటి ఈవెంట్‌కు అంతర్జాతీయ క్రీడా ఈవెంట్‌లలో పాల్గనకుండా భారత్‌ను నిషేధించడానికి గల పూర్తి కారణాలను తెలుసుకోవాలని ఢిల్లీ హైకోర్టుకు ఆదేశించింది.