Jun 02,2023 21:55
  • సిగలింగ్‌ సమస్యతో ఆగి ఉన్న గూడ్స్‌ను ఢకొీట్టిన వైనం
  • ఆరుగురు మృతి
  • 50 మందికిపైగా చనిపోయినట్టు వార్తలు
  • వందల మందికి గాయాలు
  • చీకట్లో మిన్నంటిన హాహాకారాలు

ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : హౌరా నుంచి చెన్నయ్ వెళ్తున్న రైలు నెంబర్‌ 12841 కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ శుక్రవారం రాత్రి 7:08 గంటలకు ప్రమాదానికి గురైంది. ఈ రైలు ఒడిశాలోని బాలాసోర్‌కు 40 కిలోమీటర్ల దూరంలో బహానగా బజార్‌ రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న గూడ్స్‌ రైలును ఢకొీట్టింది. ఈ రైలులో జనరల్‌ 2, స్లీపర్‌ 5, థర్డ్‌ క్లాస్‌ ఎసి 9, సెకెండ్‌ క్లాస్‌ ఎసి 2, ఫస్ట్‌ క్లాస్‌ కోచ్‌లతో కలిపి మొత్తం 18 కోచ్‌లు ఉన్నాయి. ఈ ప్రమాదంలో 3 స్లీపర్‌ కోచ్‌లు మినహా 15 కోచ్‌లు పట్టాలు తప్పాయని అధికారులు చెబుతున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోయినట్టు తెలుస్తోంది. అయితే 50 మందికిపైగానే చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. వందల మంది గాయపడినట్టు అంచనా వేస్తున్నారు. ఏడు కోచ్‌లు పూర్తిగా పల్టీ కొట్టడంతో వాటిలో ఉన్న సుమారు 550 మంది ప్రయాణికులు ప్రమాదం బారినపడ్డారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో రైలులో సుమారు 1800 ప్రయాణికులు ఉన్నారని, ప్రమాద తీవ్రత ఎక్కువగానే ఉందని అధికారులు ప్రకటించారు. సిగల్‌ లోపం కారణంగా రెండు రైళ్లు ఒకే ట్రాక్‌ పైకి వచ్చి ఢకొీన్నాయని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు భారీగా ధ్వంసమైంది. కోచ్‌ల మధ్య పలువురు ప్రయాణికులు చిక్కుకుపోగా వారిని రక్షించేందుకు స్థానికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 60 అంబులెన్సుల సహాయంతో వైద్య సేవలు అందుతున్నాయి. ఎన్‌డిఆర్‌ఎఫ్‌ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రయాణికుల వివరాల కోసం హెల్ప్‌ లైన్‌ నెంబర్లను రైల్వే శాఖ ప్రకటించింది విశాఖపట్నం వారు 0891-2746330, 0891-2744619, విజయనగరం వారు 08922-221202, 08922-221206, హౌరా వారు 033-26382217, ఖరగపూర్‌ వారు 8972073925, 9332392339, బాలాసోర్‌ వారు 8249591559, 7989418322, షాలిమర్‌ వారు 9903370746 నెంబర్లను సంప్రదించాలని అధికారులు కోరారు.

  • పట్టాలు తప్పిన యశ్వంత్‌పూర్‌ - హౌరా

ఈ ప్రమాదం జరిగిన చోటనే యశ్వంత్‌పూర్‌ - హౌరా ఎక్స్‌ప్రెస్‌ రైలు కూడా పట్టాలు తప్పింది. అప్పటికే ప్రమాదానికి గురైన కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ కోచ్‌ల్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో యశ్వంత్‌పూర్‌ - హౌరా ఎక్స్‌ప్రెస్‌కు సంబంధించిన మూడు, నాలుగు కోచ్‌లు పట్టాలు తప్పినట్టు రైల్వే అధికారి అమితాబ్‌ శర్మ ఓ ఛానల్‌కు వెల్లడించారు.