
పేదవాని చైతన్య రథం సైకిల్
దీనికుండేది రెండు చక్రాల్
దీనికి వద్దు డీజిల్ , పెట్రోల్
ఇది మానవ శక్తితో నడిచే
వెహికల్ !
ఎన్నో రెట్లు మోసేను బరువుల్
ఏ దారిలోనైన పెట్టేను పరుగుల్
ఎవరడ్డొచ్చినా మ్రోగేను
ట్రింగ్ ట్రింగ్ బెల్ !
రెండు కాళ్ళతో తొక్కాలి పెడల్
రెండు చేతులతో తిప్పాలి హ్యాండిల్
దీన్ని ఇష్టంగా తొక్కుతారు పిల్లల్
దీన్ని ఎక్కడైనా పార్క్ చేయడంలో
లేవు ఇబ్బందుల్ !
దీన్ని రోజూ తొక్కితే రోగాలు కిల్
దీన్ని రోజూ తొక్కితే తగ్గును పొట్టల్
ఒలంపిక్స్‌లో నిర్వహిస్తారు
సైకిల్ పోటీల్
పల్లె నుంచి ప్రపంచం వరకు
ఇప్పటికీ, ఎప్పటికీ దీనికి సాటి
లేదు ఏ వెహికల్ !
ప్రతి ఇంట్లో ఉండాలి
ఆరోగ్యాన్నిచ్చే సైకిల్
ఈ కాలుష్య రహిత సైకిల్
వాడాలి ప్రతి ఒక్కరూన్ ...
- బోనగిరి పాండు రంగ, తొర్రూరు