Apr 21,2023 16:45

హైదరాబాద్‌ : డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఈఐఈడీ), డిప్లొమా ఇన్‌ ప్రీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ (డీపీఎస్‌ఈ) కోర్సుల్లో 2023 -25 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాలకు నిర్వహించే డీఈఈసెట్‌-2023 నోటిఫికేషన్‌ శుక్రవారం విడుదలైంది. ప్రభుత్వ డైట్‌ కాలేజీతో పాటు, ప్రైవేట్‌ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. డీఈఈ సెట్‌ ఎగ్జామ్‌ను జూన్‌ 1న నిర్వహించనున్నట్లు కన్వీనర్‌ ఎస్‌ శ్రీనివాసచారి ఒక ప్రకటనలో తెలిపారు. రెండేండ్ల వ్యవధి గల ఈ కోర్సులో ప్రవేశ పరీక్షను కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) పద్ధతిలో నిర్వహిస్తామన్నారు. అర్హులైన అభ్యర్థులు శనివారం నుంచి మే 22వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలతో కూడిన ఇన్ఫర్మేషన్‌ బులెటిన్‌ ఈ నెల 22వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుందని, నోటిఫికేషన్‌ సహా ఇతర కోసం http://deecet.cdse.telangana.gov.in  వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.