
ప్లాస్టిక్ .. ప్లాస్టిక్ .. ప్లాస్టిక్
ఎవరికి లాభం , దేనికి లాభం
భువికి , జీవికి అపార నష్టం
ప్లాస్టిక్ ను మానకపోతే కష్టం
ప్రత్యామ్నాయం ఎంతో అభీష్టం
కాగితపు సంచులతో
కడలి జీవికి కాంతులు ...
జనపనార సంచులతో
జగతికి , జనతకు జేజేలు ...
బట్ట సంచులతో
భూమికి బలమైన పునాదులు ...
అరటాకుల్లో భోజనాలు
ఆరోగ్యానికి ఔషధ గుణాలు
మోదుగ విస్తరాకుల్లో విందులు
మానవ మనుగడకు పసందులు
ప్లాస్టిక్ వస్తువులతో ప్రమాదం !
ప్రకృతి వస్తువులతో ప్రమోదం !!
మన మార్పే భవితకు ప్రసాదం !!!
- బోనగిరి పాండు రంగ
తొర్రూరు.