Aug 19,2022 16:15

అమరావతి: ఎస్‌ఆర్‌బీఎస్‌, ఎస్‌బీటీ వంటి సంక్షేమ పథకాలు నిలిపి వేసి, ఉద్యోగ సంఘాలతో చర్చలు లేకుండా నిర్ణయాలు అమలు చేసేస్తున్నారని ఆర్టీసీ ఉద్యోగసంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.
ఆర్టీసీ ఐకాసలోని 14 ఎన్‌ఎంయూ, ఈయూ సహా వివిధ సంఘాల నేతలతో శుక్రవారం వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకాస ప్రతినిధులు మాట్లాడుతూ ''ఆర్టీసీ ఎండీ, ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వంలో విలీనంతో ఆశించిన ప్రయోజనాలు రావడం లేదు. ఎస్‌ఆర్‌బీఎస్‌, ఎస్‌బీటీ వంటి సంక్షేమ పథకాలు నిలిపేశారు. ఉద్యోగ సంఘాలతో చర్చలు లేకుండా నిర్ణయాలు అమలు చేసేస్తున్నారు. పీఆర్సీ అమలు సహా ఇబ్బందులు తీర్చాలి.'' అని తెలిపారు. ఈ మేరకు సీఎం జగన్‌కు వినతిపత్రాలు పంపాలని ఆర్టీసీ ఉద్యోగులు నిర్ణయించారు. ఉద్యోగుల సంతకాల సేకరణ అనంతరం... ఈ నెల 21 నుంచి 28 వరకు 26 జిల్లాల కలెక్టర్ల ద్వారా సీఎంకు వరుసగా వినతిపత్రాలు పంపనున్నారు.