Jun 23,2022 09:39

న్యూఢిల్లీ : అవినీతి ఆరోపణలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కార్యాలయంలోని డిప్యూటీ సెక్రటరీతో పాటు ఇద్దరు సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ను లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినయ్ కుమార్‌ సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ సెక్రటరీ ప్రకాశ్‌ చంద్ర ఠాకూర్‌, వసంత్‌ విహార్‌, వివేక్‌ విహార్‌ సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్స్‌ హర్షిత్‌ జైన్‌, దేవేంద్ర శర్మలను సస్పెండ్‌ చేస్తూ, క్రమశిక్షణా చర్యలకు బుధవారం ఆదేశించారు. కల్కాజి అభివృద్ధి పన్నుల్లో లోపాలను గుర్తించిన ఎల్‌జి .. ఢిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (డిడిఎ) చెందిన ఇద్దరు అసిసెంట్‌ ఇంజనీర్లను సోమవారం విధుల నుండి తొలగించారు. గతవారం ఎల్‌జి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రాజధానిలో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించారు. నేర సమాచార విశ్లేషణ, నివార చర్యలు, ప్రధాన సవాళ్లు, సంస్కరణలు వంటిపై పోలీసులు వివరించారు. పోలీసులు తీసుకున్న పలు చర్యలను ఎల్‌జి ప్రశంసించారు.