Sep 29,2022 19:55

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : బిసి రిజర్వేషన్ల పితామహుడు బిపి మండల్‌ విగ్రహ ఏర్పాటుకు ఉద్దేశించిన దిమ్మెను గుంటూరు నగరపాలక సిబ్బంది కూల్చివేయడం అత్యంత దుర్మార్గమని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. గౌరవ సూచకంగా ఏర్పాటు చేసిన దిమ్మెను కూల్చివేయడం జగన్‌ దుర్మార్గానికి పరాకాష్ట అని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బడుగు, బలహీన తరగతుల అభ్యున్నతికి బాటలు వేసిన మండల్‌ విగ్రహ దిమ్మెను కూల్చివేసి బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీలను జగన్‌ అవమానించారని విమర్శించారు. కనీస సమాచారం కూడా ఇవ్వకుండా కూల్చాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు.