Sep 29,2022 19:42
  •  ప్రత్నామ్నాయం చూపాలని సిఎంకు లేఖ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఫ్లెక్సీ ప్రింటింగ్‌ రంగంపై ఆధారపడ్డ వారిని ఆదుకోవాలని టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్‌ కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి గురువారం లేఖ రాశారు. ముందస్తు ప్రణాళిక లేకుండా హడావుడి నిర్ణయం తీసుకోవడంతో ఫ్లెక్సీ ప్రింటింగ్‌ పరిశ్రమ సంక్షోభంలో పడిందని విమర్శించారు. ఈ రంగంపై ఆధారపడ్డ సుమారు 7 లక్షల మంది భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. నిషేధం విధిస్తే తలెత్తే పరిణామాలు, దీనిపై ఆధారపడ్డ వారికి కలిగే నష్టం, ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి ప్రభుత్వం ఎటువంటి కసరత్తూ చేయలేదన్నారు. వైసిపి కనుసన్నల్లో నడుస్తున్న ఇసుక, మట్టి, మైనింగ్‌ మాఫియాను అరికట్టడంలో శ్రద్ధ చూపిస్తే పర్యావరణానికి మేలు చేసినట్లు అవుతుందని తెలిపారు. విశాఖలో రుషికొండను బోడికొండగా వైసిపి నేతలు మార్చారని ఆరోపించారు.