Jul 05,2022 11:36

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : జూన్‌ 1 నుంచి ఇంటింటికి సిపిఎం కార్యక్రమం నిర్వహించారు. సిపిఎం నిర్వహించిన కార్యక్రమంలో గుర్తించిన ప్రజా సమస్యలు పరిష్కారం కోసం జూలై 11 న జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ ప్రకటించారు. మంగళవారం స్థానిక ఎల్‌బిజి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సూర్యనారాయణ మాట్లాడుతూ ... ఇంటింటికి సిపిఎం కార్యక్రమంలో తమ దఅష్టికి అనేక సమస్యలు వచ్చాయన్నారు. జిల్లాలో చాలా మందికి ఇళ్లు లేవని, స్థలాలు ఇవ్వలేదనీ, పట్టలిచ్చినప్పటికీ స్థలాలు ఇవ్వలేదనీ, పెన్షన్‌ సమస్య ఉందని చెప్పారు. చాలా కాలనీలకు తాగు నీటి సమస్య ఉందని, రోడ్లు, కాలువలు లేవని అన్నారు. కొండ కెంగువ గ్రామంలో టిడిపి సర్పంచ్‌ ఉన్నా అధికార పార్టీ వారు ఆయనను పక్కన పెట్టడంతో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని ధ్వజమెత్తారు. మరోవైపు గ్రీన్‌ ఫీల్డ్‌ రైతులు, సుజల స్రవంతి రైతులు పోరాటాలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇంటింటికి సిపిఎం కార్యక్రమంలో గుర్తించిన ప్రజా సమస్యల పరిష్కారం కోసం జూలై 11న జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపడతామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 25 వేలమందిని 500 దళాలతో కలిశామన్నారు. 200 గ్రామాల్లో జిల్లాలో అన్ని పట్టణాల్లోకి వెళ్లామన్నారు. ప్రజల నుంచి వినతులు, గుర్తించిన సమస్యల పరిష్కారం కోసం చేపట్టనున్న ధర్నాలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ధర్నా గోడ పత్రికను విడుదల చేశారు.