Jul 05,2022 10:56

పలమనేరు (చిత్తూరు) : స్కూల్‌ విలీనం వద్దంటూ... జర్రావారిపల్లిలోని పాఠశాల ముందు తల్లిదండ్రులు, విద్యార్థులు మంగళవారం ధర్నా చేపట్టారు. గంగవరం మండలం బండమీద జర్రావారిపల్లిలోని ప్రాథమికోన్నత పాఠశాలలోని 6 వ తరగతి నుంచి 8 వ తరగతి వరకు ఉన్న పాఠశాలను కీలపట్లలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు జరావారిపల్లి పాఠశాల ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. జరావారిపల్లిలోని ప్రాథమికోన్నత పాఠశాలను కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.