
ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఓవరాక్షన్‌పై దినేశ్ కార్తీక్ ట్విట్టర్ వేదికగా సెటైర్స్ వేశాడు. ఇంగ్లాండ్- టీమిండియా జట్ల మధ్య జరుగుతున్న 5వ టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో టీమిండియా 416 పరుగులు చేసింది. భారత జట్టు 98 పరుగులకే 5 వికెట్లను కోల్పోయిన దశలో టీమిండియా డాషింగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ 111 బంతుల్లో 146 పరుగులు చేసి జడేజాతో కలిసి భారత జట్టు స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. అయితే పంత్ 146 పరుగుల వద్ద జో రూట్ బౌలింగ్‌లో అవుట్ అయిన విషయం తెలిసిందే. ఇక, మొదటి రోజు మ్యాచ్ హైలెట్స్‌ను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు యూట్యూబ్‌లో పెట్టింది. కానీ, దానికి టైటిల్.. మాత్రం ఇంగ్లాండ్ జట్టును పొడుగుతున్నట్టుగా రాసుకొచ్చింది. రిషబ్ పంత్‌ను ఔట్ చేసిన రూట్ అని ఇచ్చింది. ఇక ఈ టైటిల్‌ను చూసిన దినేష్ కార్తీక్.. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుపై సెటైర్స్ వేశాడు. కార్తీక్ ట్విట్టర్ వేదికగా.. ''రిషబ్ పంత్ అటువంటి ఆకట్టుకునే అద్భుతమైన బ్యాటింగ్ చేసిన తర్వాత.. ఇంగ్లాండ్ బోర్డు ఇంతకంటే మంచి టైటిల్ పెట్టవచ్చు. కానీ, రెండు జట్లు ఇంత మంచి క్రికెట్ ఆడిన తర్వాత కూడా ఇంగ్లాండ్ బోర్డుకు మంచి టైటిల్ రానట్లుంది'' అని రాసుకొచ్చాడు. సాధారణంగా క్రికెట్ మ్యాచ్ అనంతరం.. ఎవరు మంచి ప్రదర్శ చేస్తారో వార పేరునే టైటిల్స్ పెడతారు. కానీ, ఈసీబీ మాత్రం అలా చేయకపోవడంతో దినేశ్ కార్తీక్ ఇలా కౌంటర్ అటాక్ ఇచ్చాడు.