Jun 24,2022 08:25

న్యూఢిల్లీ : జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) డైరెక్టర్‌ జనరల్‌గా పంజాబ్‌ మాజీ డిజిపి దినకర్‌ గుప్తా నియమితులయ్యారు. ఈ మేరకు నియామకాల క్యాబినేట్‌ కమిటీ (ఎసిసి) గురువారం ఆమోదించింది. 2024 మార్చి 31 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు. 1987 బ్యాచ్‌ పంజాబ్‌ క్యాడర్‌కు చెందిన ఆయన్ను.. 2021లో చరణ్‌ జీత్‌ సింగ్‌ ప్రభుత్వం డిజిపిగా తొలగించి.. పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌లో నియమించింది. కాగా, దినకర్‌ దాదాపు సంవత్సరం పాటు సెంట్రల్‌ డిప్యుటేషన్‌ కోసం ఆఫర్‌ లిస్టలో ఉన్నారు. ఆయన భార్య, అమరీందర్‌ సింగ్‌ ప్రభుత్వంలో చీఫ్‌ సెక్రటరీగా వ్యవహరించిన ఐఎఎస్‌ అధికారి వినీ మహాజన్‌ ఈ ఏడాది జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు.
హోంశాఖ ప్రత్యేక కార్యదర్శిగా (అంతర్గత భద్రత) స్వాగత్‌ దాస్‌ నియమితులయ్యారు. 2024 నవంబర్‌ వరకు ఆయన పదవిలో కొనసాగుతారు. 1987 బ్యాచ్‌ ఛత్తీస్‌గఢ్‌ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి అయిన దాస్‌.. ప్రస్తుతం ఐబీలో స్పెషల్‌ డైరెక్టర్‌గా ఉన్నారు.