May 26,2023 10:59

కర్నూలు : కడప ఎంపి వైఎస్‌ అవినాష్‌రెడ్డి తల్లి లక్ష్మమ్మ ఆరోగ్యం మెరుగుపడుతోందని, ఆమెను ఈరోజే డిశ్చార్జి చేస్తామని కర్నూలు విశ్వభారతి వైద్యులు వెల్లడించారు. తాజాగా ... లక్ష్మమ్మ ఆరోగ్యం విషయమై విశ్వభారతి వైద్యులు శుక్రవారం హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేశారు. లక్ష్మమ్మ ఆరోగ్యం నిలకడగా ఉందనీ, ఈరోజు ఆమెను డిశ్చార్జ్‌ చేస్తామని, గుండె సంబంధిత చికిత్స కోసం వేరే ఆస్పత్రికి రిఫర్‌ చేస్తామని వైద్యులు ప్రకటించారు. దీంతో మెరుగైన వైద్యం కోసం ఆమెను హైదరాబాద్‌కు తరలించే అవకాశం ఉంది.