Aug 19,2022 10:16

ప్రజాశక్తి - కశింకోట (అనకాపల్లి) : మండలంలోని తాళ్ళపాలెం పాలకేంద్రంలో 143 మంది పాడి రైతులకు విశాఖ డెయిరీ డైరెక్టర్‌ మలసాల రమణారావు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాడి రైతుల కోసం డైయిరీ అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాల దిగుబడి పెంచేందుకు కృషి చేయాలని పాడి రైతులకు చెప్పారు. ఈకార్యక్రమంలో ఏరియా మేనేజర్‌ యన్‌.నాగేశ్వరరావు, సూపర్‌ వైజర్‌ పైలా రామచంద్రరావు , పాలసంఘం అధ్యక్షుడు గుమ్మడి నారాయణరావు, పాడి రైతులు పాల్గొన్నారు.