Oct 05,2022 15:35

ప్రజాశక్తి-పెరవలి(తూర్పుగోదావరి) : మండలంలోని ముక్కామల గ్రామ సచివాలయానికి విజయదశమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ఎంఎస్‌ఎమ్‌ ఈ కార్పొరేషన్‌ చైర్మన,్‌ ఇండియన్‌ హెయిర్‌ ఇండిస్టీస్‌ రవళి స్పిన్నర్స్‌ ఖండవల్లి అధినేత లయన్‌ వంక రవీంద్రనాథ్‌ ట్రాక్టర్‌ను బహుకరించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ట్రాక్టర్‌ను గ్రామ సర్పంచ్‌ కేతా త్రిమూర్తులకు స్వయంగా ఆయన అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రవళి స్పిన్నర్స్‌ ఫ్యాక్టరీ ముక్కామల ఖండవల్లి 2 గ్రామాల్లో స్థాపించడం వల్ల ఈ రెండు గ్రామాల ప్రజలు కార్మికులుగా రవళి స్పిన్నర్స్‌లో ఉపాధి పొందుతున్నారని తెలిపారు. గతంలో ఖండవల్లి గ్రామ సచివాలయానికి పారిశుద్ధ్య పనుల నిమిత్తం ఒక ట్రాక్టర్‌ బహూకరించామన్నారు. ముక్కామల గ్రామ ప్రజల కోరిక మేరకు గ్రామానికి పారిశుద్ధ్య పనులు నిమిత్తం ఒక ట్రాక్టర్‌ను అందజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం రవళి స్పిన్నర్స్‌ డైరెక్టర్‌ వంక రఘువీర్‌ వంక రవళి వికాస్‌ దంపతులు వంక విక్రాంత్‌ రానా లను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. విజయదశమి సందర్భంగా గ్రామంలోని అమ్మవారి దేవస్థానం సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ కేతా త్రిమూర్తులు, వైస్‌ ఎంపీపీ వేండ్ర శ్రీనివాస్‌, ఎంపీటీసీ గండేపల్లి రామకృష్ణ, సొసైటీ అధ్యక్షులు రేలంగి ఏసు, బోళ్ల మంగారావు, లైన్స్‌ క్లబ్‌ అధ్యక్షురాలు అరిగెల అరుణకుమారి, సెక్రెటరీ సలాది ఉదయభాస్కరరావు పాల్గొన్నారు.