Jan 24,2023 16:23

హైదరాబాద్‌ :భాగ్యనగరంలో మరోసారి డ్రగ్స్‌ కలకలం రేపింది. భరత్‌ అనే డ్రగ్‌ పెడ్లర్‌ను నార్కోటిక్‌ ఎన్ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ అరెస్ట్‌ చేసింది. ముంబై నుండి డ్రగ్స్‌ తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అంబర్‌పేట్‌లో ఒక కస్టమర్‌కు భరత్‌ డ్రగ్స్‌ విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 15 గ్రాముల ఎమ్‌డీఎమ్‌ఏ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు కస్టమర్లను పోలీసులు గుర్తించారు. విద్యార్థులు, యూత్‌ డ్రగ్స్‌కి బానిసలు కావద్దంటూ పోలీసులు సూచిస్తున్నారు. పిల్లల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని పోలీసులు కోరుతున్నారు.