
ప్రజాశక్తి- అమరావతి బ్యూరో :అగ్రిగోల్డు బాధితులకు బకాయిలు తక్షణమే చెల్లించాలని, హాస్టళ్లలో మెస్‌ఛార్జీలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంటు నర్రెడ్డి తులసిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా విడుదల చేయాల్సిన రూ.1,798 కోట్లు విడుదల చేయకపోవడంతో రాష్ట్రంలో రూ.1.33 లక్షల కోట్లు విలువజేసే కేంద్ర ప్రాజెక్టులు ఆగిపోవడం దురదృష్టకరమన్నారు.