Sep 22,2022 20:02

కోయంబత్తూరు: దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో సౌత్‌ జోన్‌కు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యత లభించింది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 8 వికెట్ల నష్టానికి 250పరుగులతో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన వెస్ట్‌జోన్‌ జట్టు 270పరుగులకు ఆలౌటైంది. హెట్‌ పటేల్‌(98) సెంచరీని, ఉనాద్కట్‌(47) అర్ధసెంచరీకి దగ్గర్లో ఔటయ్యారు. సాయికిషోర్‌కు ఐదు, బసెల్‌ థంపీ, స్టెఫెన్స్‌కు రెండేసి, గౌతమ్‌కు ఒక వికెట్‌ లభించాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన సౌత్‌ జోన్‌ జట్టు రెండోరోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 318పరుగులు చేసింది. బాబా ఇంద్రజిత్‌(118) సెంచరీకి తోడు, కృష్ణప్ప గౌతమ్‌(43), మనీష్‌ పాండే(48) బ్యాటింగ్‌లో రాణించారు. గురువారం ఆట ముగిసే సమయానికి రవితేజ(26), సాయికిషోర్‌(6) క్రీజ్‌లో ఉన్నారు. దీంతో సౌత్‌ జోన్‌ జట్టుకు ఇప్పటికే 48పరుగుల ఆధిక్యత లభించింది. ఉనాద్కట్‌, అతిల్‌ శేఠ్‌కు మూడేసి, తనుష్‌కు ఒక వికెట్‌ లభించాయి.

cricket