Sep 21,2022 19:59

కోయంబత్తూరు: దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో సౌత్‌జోన్‌ బౌలర్లు రాణించడంతో వెస్ట్‌జోన్‌ జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 250పరుగులకు 8వికెట్లు కోల్పోయింది. ఎస్‌ఎన్‌ఆర్‌ కాలేజీ క్రికెట్‌గ్రౌండ్‌లో జరుగుతున్న ఫైనల్లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన వెస్ట్‌జోన్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు జైస్వాల్‌(1), ప్రియాంక్‌(7)కి తోడు కెప్టెన్‌ రహానే(8) నిరాశపరిచారు. దీంతో ఆ జట్టు 16పరుగులకే 3వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింంది. ఆ దశలో శ్రేయస్‌ అయ్యర్‌(37), సర్ఫరాజ్‌ ఖాన్‌(34) రాణించారు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి హెట్‌ పటేల్‌(96), ఉనాద్కట్‌(39) క్రీజ్‌లో ఉన్నారు. వీరిద్దరూ కలిసి 9 వికెట్‌కు ఇప్పటికే 83పరుగులు జతచేశారు. సౌత్‌జోన్‌ బౌలర్లు సాయికిషోర్‌కు మూడు, బసిల్‌ థంపీ, స్టెఫెన్స్‌కు రెండేసి వికెట్లు దక్కాయి.
స్కోర్‌బోర్డు..
వెస్ట్‌జోన్‌ ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి)బురు (బి)స్టెఫెన్స్‌ 1, ప్రియాంక్‌ (ఎల్‌బి) స్టెఫెన్స్‌ 7, రహానే (సి)రవితేజ (బి)థంపీ 8, శ్రేయస్‌ (సి)ఇంద్రజిత్‌ (బి)సాయికిషోర్‌ 37, సర్ఫరాజ్‌ (సి)ఇంద్రజిత్‌ (బి)సాయికిషోర్‌ 34, హెట్‌ పటేల్‌ (నాటౌట్‌) 96, షామ్స్‌ ములానీ (ఎల్‌బి) సాయికిషోర్‌ 0, అతిల్‌ షేట్‌ (సి)ఇంద్రజిత్‌ (బి)థంపీ 25, తనుష్‌ కొటియాన్‌ (సి)మనీష్‌ పాండే (బి)గౌతమ్‌ 2, ఉనాద్కట్‌ (నాటౌట్‌) 39, అదనం 1. (90 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి) 250పరుగులు.
వికెట్ల పతనం: 1/1, 2/10, 3/16, 4/64, 5/99, 6/101, 7/164, 8/167
బౌలింగ్‌: బసిల్‌ థంపీ 15-2-42-2, స్టెఫెన్స్‌ 10-2-39-2, సాయికిషోర్‌ 32-6-80-3, రవితేజ 7-3-15-0, గౌతమ్‌ 25-1-73-1.