Oct 05,2022 19:42

ప్రజాశక్తి - వన్‌టౌన్‌ : దసరా ఉత్సవాలను పురస్కరించుకుని బుధవారం జరగాల్సిన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల తెప్పోత్సవం రద్దైంది. మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుండటంతో తెప్పోత్సవాన్ని రద్దు చేసినట్లు దుర్గగుడి అధికారులు వెల్లడించారు. దుర్గగుడి స్థానాచార్యులు శివప్రసాద్‌ శర్మ మాట్లాడుతూ.. వాతావరణం అనుకూలించకపోవడం వల్లనే తెప్పోత్సవాన్నినిర్వహించలేకపోతున్నాం. తెప్పోత్సవం రద్దు చేయడం ఇది రెండోసారని తెలిపారు. మహామండపంలో కుంకుమార్చనలు జరిగే ప్రదేశంలో కొబ్బరికాయ కొట్టి హారతులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.