Oct 05,2022 11:49

ప్రజాశక్తి-వన్‌టౌన్‌ (ఎన్‌టిఆర్‌) : విజయదశమిని పురస్కరించుకొని ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. 10వ రోజు శ్రీరాజరాజేశ్వరీ దేవి అలాంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఇంద్రకీలాద్రి ఫై దుర్గా భవానీ లు అమ్మవారి దర్శనం కోసం పోటెత్తారు. ఆలయ ప్రాంగణం ఘాట్‌ రోడ్లు మొత్తం ఎక్కడ చూసినా భవానీలతో ఎర్రసంద్రంగా మారిపోయింది. వినాయక గుడి నుంచి క్యూలైన్‌లలో భవానీలు అమ్మవారి దర్శనం కోసం గంటలకొద్ది వేచి ఉన్నారు. ఈ రోజు విఐపి లకు రూ.500 టిక్కెట్స్‌ తప్పించి మిగతా అన్ని ఉచిత లైన్లలో దర్శన భాగ్యం కల్పించారు. ఇంద్రకీలాద్రి భవానీలతో పోటెత్తడంతో వివిఐపిల వాహనాలకు మాత్రమే కొండపైకి అనుమతిస్తున్నారు.