Sep 23,2022 08:14

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎపిఇఎపిసెట్‌-2022 అడ్మిషన్ల తొలిదశ కౌన్సెలింగ్‌ ముగిసింది. మొత్తం 1,11,864 సీట్లలో 20,615 సీట్లు భర్తీ కాలేదు. తొలిదశ కౌన్సెలింగ్‌లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు అడ్మిషన్ల కన్వీనరు సి నాగరాణి గురువారం సీట్లు కేటాయించారు. ఈ పరీక్షలో మొత్తం 1,73,572 మంది అర్హత సాధించగా, 1,02,133 మంది కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. వీరిలో 1,01,318 మంది సర్టిఫికెట్లు వెరిఫికేషన్‌ చేయించుకోగా, 99,025 మంది ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. మొత్తం 32,54,601 ఆప్షన్లు విద్యార్థులు నమోదు చేసుకున్నారు. 248 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కన్వీనరు కోటా కింద 1,11,864 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో 91,249 సీట్లు భర్తీ అయ్యాయి. 20,615 సీట్లు మిగిలాయి.