Nov 23,2022 17:51

కాబూల్‌ : ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.3గా నమోదైంది. ఆఫ్ఘనిస్తాన్‌లో సంభవించిన ఈ భూకంపం దాదాపు 200 కిలోమీటర్ల లోతున సంభవించినట్లు నేషనల్‌ సిస్మోలజీ సెంటర్‌ ట్వీట్‌లో పేర్కొంది. ఇక ఈ నెలలోనే నవంబర్‌ 7న ఆఫ్ఘనిస్తాన్‌లోని బదక్షన్‌ ప్రావిన్స్‌లోని కొన్ని ప్రాంతాలలో 5.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇది 103 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు తాలిబన్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కల్చర్‌ హెడ్‌ మొయిజుద్దీన్‌ అహ్మదీ తెలిపారు.
కాగా, ఆఫ్ఘనిస్తాన్‌ మాత్రమే కాదు, యూరోపియన్‌ దేశమైన టర్కీలోనూ భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం టర్కీలోని అంకారా నగరంలో 6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు సిస్మోలజీ సెంటర్‌ వెల్లడించింది. భూకంప ప్రభావానికి 35 మంది గాయపడ్డారు. క్షతగాత్రులకి ఆసుపత్రుల్లో చికిత్సనందిస్తున్న్టట్లు టర్కీ ఆరోగ్యమంత్రి ఫహ్రెటీన్‌ కోకా ట్విటర్‌ ద్వారా తెలిపారు.