Oct 05,2022 15:53

ప్రజాశక్తి - పాలకొల్లు (పశ్చిమగోదావరి) : ఎన్టీఆర్‌ టిడ్కో గృహాల వద్ద అంగన్వాడీ, హెల్త్‌ సెంటర్‌, బ్యాంకులు, ఎటిఎమ్‌లు, రైతు బజార్లు వంటి ఇతర సౌకర్యాలు పూర్తిస్థాయిలో వచ్చేలా కృషి చేస్తామని ఎంఎల్‌ఏ నిమ్మల రామానాయుడు చెప్పారు. విజయ దశమి సందర్భంగా పలు గృహ ప్రవేశాలకు బుధవారం ఆయన హాజరైయ్యారు. ఈ సదంర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1856 గహాలు పూర్తి అయ్యాయని తెలిపారు. మిగిలిన వాటిలో కూడా వసతులు పూర్తి చేసి త్వరితగతిన అందజేస్తామని హామీ ఇచ్చారు.