Apr 22,2023 17:55

జమ్మూ కాశ్మీర్‌ : రంజాన్‌ వేడుకలు జమ్మూకాశ్మీర్‌లో శనివారం ఘనంగా జరిగాయి. ఈ పండుగ సందర్భంగా కాశ్మీర్‌లోని మసీదులు భక్తులతో కిక్కిరిశాయి. ఇక కాశ్మీర్‌లోని దాల్‌ సరస్సు ఒడ్డున ఉన్న హజ్రత్‌బాల్‌ మసీదుకు అత్యధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అయితే ఓల్డ్‌ సిటీలోని జామియా మసీదులో ఈద్‌ ప్రార్థనలకు అధికారులు అనుమతించలేదు. ఆ తర్వాత ఆలస్యంగా ఉదయం 7.30 గంటల నుంచి 9.00 గంటలకు వరకు ప్రార్థనలు జరుపకోమని మసీద్‌ మేనేజ్‌మెంట్‌కి అధికారులు అనుమతించారు. అయితే సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఆలస్యంగా రావడంతో.. ప్రార్థనలు రూ. 7.30 గంటలకు ప్రారంభించలేదని జామియా మసీద్‌ మేనేజ్‌మెంట్‌ తెలిపింది. ఇక రంజాన్‌ రోజున ముస్లిం మతానికి చెందిన మహిళలు, చిన్నారులు అందరూ కొత్త దుస్తులు ధరించి ఉత్సాహంగా జరుపుకున్నారు. ఇక హజ్రత్‌బాల్‌ మందిరంలో జరిగిన సామూహిక ప్రార్థనల్లో జమ్మూ, కాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా కూడా పాల్గొన్నారు.