Jul 04,2022 17:17

ముంబయి :  విశ్వాస పరీక్షను నెగ్గిన అనంతరం ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఉద్ధవ్‌ థాకరేపై తిరుగుబాటు ప్రకటించడంతో తన కుటుంబానికి బెదిరింపులు వచ్చాయని అంటూ... గతంలో చనిపోయన తన ఇద్దరు కుమారులను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. వారు తమ కుటుంబంపై దాడి చేశారని,  ఈ దాడిలో తన తల్లి మరణించగా,  అన్నారు. తన తండ్రి బతికే ఉన్నారని చెప్పారు. తన తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడపలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తాను వచ్చేసరికి వారు నిద్రపోయేవారని, వారు బయటికి వెళ్లే సమయానికి తాను నిద్రపోయి ఉండేవాడినని, దీంతో వారితో గడిపేందుకు సమయం ఉండేది కాదని అన్నారు. అలాగే తన కుమారుడు శ్రీకాంత్‌తో కూడా ఎక్కువ సమయం గడపలేకపోయానని అన్నారు. తన ఇద్దరు పిల్లలు మరణించిన సమయంలో శివసేన సీనియర్‌ నేత ఆనంద్‌ ధిఘే తనను ఓదార్చారని చెప్పారు. అప్పుడు తాను ఎందుకోసం బతకాలని ప్రశ్నించుకున్నానని కన్నీటి పర్యంతమయ్యారు. కానీ తన కుటుంబం కోసం తాను జీవించానని షిండే పేర్కొన్నారు. ఆనంద్‌ ధిఘే తన కన్నీళ్లు తుడిచారని, అలాగే ఇతరుల కన్నీళ్లు తుడవమని తనకు స్ఫూర్తినిచ్చారని అన్నారు. తాను కోలుకోవడానికి, అసెంబ్లీలో శివసేన నేత స్థాయికి   ఎదిగేలా  చేశారని గుర్తు చేసుకున్నారు.