Oct 05,2022 14:52

ప్రజాశక్తి - కైకలూరు : ఎన్నో సంవత్సరాలుగా సాగుతున్న చీకటి ప్రయాణానికి స్వస్తి పలుకుతూ విద్యుత్‌ లైట్ల ఏర్పాటు ద్వారా సమస్యకు నేటితో తెరదించడం చాలా సంతోషంగా ఉందని కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అన్నారు. బుధవారం కైకలూరు ఎంపీపీ అడవి కృష్ణ ఆధ్వర్యంలో ఆచవరం గ్రామ పంచాయతీ పరిధిలో మెయిన్‌ రోడ్డు నుంచి ఆచవరం ఊరి వరకు 28 విద్యుత్‌ స్తంభాలకు లైట్‌లను మరమతులు చేయించి వినియోగంలోకి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ కట్టా నాగరాజు, మాడపాటి శ్రీను, బుర్ల ఏసుబాబు, నిమ్మల సాయి, గోపయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.