Aug 05,2022 10:40

వరంగల్‌ : అప్పులు తీర్చలేక ఇంజినీర్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటన గురుద్వారా ప్రాంతంలోని లోటస్‌ గ్రాండ్‌ హోటల్‌లో జరిగింది.

గోపాలపురం సిఐ సాయి ఈశ్వర్‌గౌడ్‌ కథనం మేరకు ... వరంగల్‌ కాశీబుగ్గకు చెందిన మామిడి లక్ష్మిసాయి (22) బీటెక్‌ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇంటర్వ్యూ ఉందని గతనెల 31న నగరానికి వచ్చాడు. గురుద్వారా ప్రాంతంలోని లోటస్‌ గ్రాండ్‌ హౌటల్‌లో దిగాడు. రెండురోజుల నుంచి అతని ఆచూకీ తెలియలేదు. ఈక్రమంలో.. అద్దె చెల్లించకపోవడంతో గురువారం హోటల్‌ రూమ్‌ బారు శ్యామ్‌ తలుపు కొట్టాడు. లక్ష్మీసాయి స్పందించకపోవడంతో హౌటల్‌ యజమానికి చెప్పాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. గది తలుపులు బద్ధలుకొట్టి చూడగా బాత్‌రూమ్‌లో బైండింగ్‌ వైర్‌తో లక్ష్మీసాయి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. అతని వద్ద సూసైడ్‌ నోటు లభ్యమైంది. ' తెలిసీ తెలియక అప్పులు చేశా... వాటిని తీర్చేలేకపోతున్నా.. చాలా అబద్ధాలు చెప్పా.. నా మాటలన్నీ నాటకమే.. దయచేసి అర్థం చేసుకోండి.. అమ్మా, నాన్న, గుడి, తమ్ముళ్లు జాగ్రత్త ' అని లేఖలో రాసి ఉంది. సోమవారం రాత్రి చివరి ఫోన్‌కాల్‌ ఉండటంతో అదేరోజు ఇంజినీర్‌ ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చునని పోలీసులు భావిస్తున్నారు. సూసైడ్‌నోట్‌ ఆధారంగా అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.