Nov 23,2022 20:53

బెంగళూరు : విద్యుత్‌ వాహనాల స్కూటర్‌ బ్రాండ్‌ ఎథర్‌ ఎనర్జీ తమ రెండవ తయారీ కేంద్రాన్ని తమిళనాడులోని హోసూర్‌లో ప్రారంభించింది. 3 లక్షల చదరపు అడగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్‌తో కంపెనీ తయారీ సామర్థ్యం ఏడాదికి 4.20 లక్షల యూనిట్లకు చేరనుందని తెలిపింది. అదే విధంగా తమ ప్రతిష్టాత్మక స్కూటర్లు 450 ఎక్స్‌, 450 ప్లస్‌ కోసం పెరుగుతున్న డిమాండ్‌ అవసరాలను సైతం తీర్చనుందని పేర్కొంది.