Oct 01,2022 10:26

న్యూఢిల్లీ : విదేశీ వినియోగదారులతో సమానంగా భారత వినియోగదారులకు కూడా గోప్యత కల్పించాలని సోషల్‌ మీడియా సంస్థలకు సూచించినట్లు సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 'మా విధానం స్పష్టంగా ఉంది. అవి ఎంత పెద్ద సంస్థలైనా సరే.. భారతదేశంలో పనిచేస్తున్నప్పుడు భారత చట్టాలకు లోబడి పని చేయాలి. ప్రపంచంలో ఇతర పౌరులతో ప్రవర్తించినట్లే భారతీయ పౌరులను కూడా సమాన స్థాయిలో గోప్యతతో చూడాలి' అని జస్టిస్‌ జోసెఫ్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ముందు సోలిసిటర్‌ జనరల్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తెలిపారు.