Aug 09,2022 20:22

రోడ్‌సైడ్‌ సర్వీసు మద్దతు
హైదరాబాద్‌  : 
విద్యత్‌ వాహన బ్రాండ్‌ ఇవియమ్‌ తన ఖాతాదారుల వాహనాలు దారి మధ్యలో చెడిపోయినప్పుడు రోడ్‌సైడ్‌ సహాయతను అందించేందుకు వీలుగా గ్లోబల్‌ అస్యూర్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. దీంతో అన్ని వేళల తమ వినియోగదారులకు తోడ్పాటు లభించనుందని తెలిపింది. విక్రయానంతర సేవను అందించడానికి గాను కృతనిశ్చయముతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఇవియమ్‌ మార్కెటింగ్‌, సేల్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆదిత్య రెడ్డి పేర్కొన్నారు. ఈ కంపెనీ మూడు, ద్విచక్ర ఇవిలను విక్రయిస్తోంది.