
రాజమండ్రి : రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబును ఆయన కుటుంబసభ్యులు కలిశారు. చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సోమవారం ఉదయం ములాఖత్ ద్వారా చంద్రబాబును కలిశారు. సుమారు 45 నిమిషాల పాటు చంద్రబాబుతో మాట్లాడారు. మరికొద్దిపేపటిలో న్యాయవాదుల బఅందం కూడా చంద్రబాబును కలిసే అవకాశం ఉంది. రేపటికి వాయిదా పడిన కేసులపై న్యాయవాదులతో చంద్రబాబు చర్చించనున్నారు.