Jul 01,2022 12:16

ప్రజాశక్తి-గుత్తి (అనంతపురం) : వ్యవసాయ పనులకు వెళుతూ రోడ్డు ప్రమాదంలో రైతు మరణించిన సంఘటన శుక్రవారం మండలంలోని కొజ్జేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... గ్రామానికి చెందిన ఈశ్వరయ్య (65) అనే రైతు తన పొలంలో వ్యవసాయం చేయడానికి ఎద్దుల బండిపై వెళుతుండగా బండి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రైతును చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో రైతును అక్కడి నుండి కర్నూలు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ రైతు మృతి చెందాడు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.