Sep 22,2022 20:47

ప్రజాశక్తి-పుల్లలచెరువు (ప్రకాశం జిల్లా) : అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలంలో గురువారం చోటు చేసుకుంది. మృతుని కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. ఆర్‌. ఉమ్మడివరం గ్రామానికి చెందిన రైతు గంగవరపు కృష్ణారెడ్డి (32) తన ఐదెకరాల సొంత పొలంతో పాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని మిర్చి, పత్తి, కంది పంటలు సాగు చేశారు. సాగు నిమ్తితం రూ. పది లక్షలు అప్పు చేశారు. పంటలు దక్కకపోవడంతో నష్టాలపాలయ్యారు. రుణదాతల ఒత్తిడి తాళలేక, అప్పులు తీరే దారిలేక పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు