Oct 05,2022 14:49

హైదరాబాద్‌: రైతు సంక్షేమమే ప్రధాన ఎజెండాగా బీఆర్‌ఎస్‌ పనిచేస్తుందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ''దేశ ప్రజల కోసమే బీఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేశాం. దేశంలో చాలా పార్టీలకు రాజకీయం క్రీడలా మారింది. తనకు మాత్రం రాజకీయం ఒక టాస్క్‌. దేశంలో రైతుల పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది. ఆహారభద్రత ఉన్న రాష్ట్రంలో ప్రాసెసింగ్‌ పుడ్‌పై ఆధారపడడం సిగ్గుచేటు. విదేశాల నుంచి ప్రాసెసింగ్‌ ఫుడ్‌ దిగుమతి చేసుకోవడం దారుణం. మహారాష్ట్ర, కర్ణాటకలోని రైతులకు మేలు జరిగేలా ముందుగా ప్రయత్నిస్తాం '' అని కేసీఆర్‌ ప్రకటించారు.