Sep 23,2022 06:01

లండన్‌: లావర్‌ కప్‌ పురుషుల డబుల్‌ బరిలోకి ఫెదరర్‌-నాదల్‌ ఆడనున్నారు. ఈ టోర్నీ అనంతరం టెన్నిస్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు రోజర్‌ ఫెదరర్‌ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో కెరీర్‌లో ఆఖరి టోర్నమెంట్‌ ఆడుతున్న ఫెదరర్‌కు లావర్‌ కప్‌ను అందించాలనే ఉద్దేశ్యంతో వీరిద్దరూ జతకూడారు. ఇక లావర్‌ కప్‌ పురుషుల డబుల్స్‌లో వీరు అమెరికాకు చెందిన టఫీ-జాక్‌ సోక్‌ల తలపడనున్నారు. చివరిసారిగా వీరిద్దరూ 2019లో సామ్‌ క్వెర్రీ-జాక్‌ సాక్‌లను మూడు సెట్ల హౌరాహౌరీ పోరులో ఓడించారు. అనంతరం వీరిద్దరూ ఏ టోర్నమెంట్‌లోనూ కలిసి బరిలోకి దిగలేదు. లావర్‌ కప్‌ సింగిల్స్‌లో ఫెదరర్‌ 6-0తో రికార్డును కలిగి ఉన్నా.. ఈసారి సింగిల్స్‌లో ఆడే అవకాశం దక్కలేదు. ఇక ఫెదరర్‌ చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీని 2021 వింబుల్డన్‌లో ఆడాడు. ఆ టోర్నీ క్వార్టర్స్‌లో హుర్క్రరాజ్‌ చేతిలో ఓడాడు. అనంతరం గాయాలబారినపడి శస్త్రచికిత్స చేయించుకొన్నాడు. లావర్‌ బప్‌ సింగిల్స్‌ బరిలో సిట్సిపాస్‌, రూఢ్‌, ఆండీ ముర్రే తదితరులు సింగిల్స్‌ బరిలో దిగనున్నాడు.
పురుషుల సింగిల్స్‌..
రూఢ్‌ × జాక్‌ సోక్‌
సిట్సిపాస్‌ × స్వాట్జ్‌మన్‌
ఆండీ ముర్రే × డీ-మినర్‌
పురుషుల డబుల్స్‌...
ఫెదరర్‌-నాదల్‌ × జాక్‌ సోక్‌-టఫీ