Aug 19,2022 11:32

ప్రజాశక్తి - పరవాడ(అనకాపల్లి) : మండల కేంద్రం పరవాడలో గురువారం రాత్రి అగ్నిప్రమాదం సంబంధించినది. ఈ ప్రమాదంలో నాలుగు షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తేలు చలపతిరావుకు సంబందించిన షాపులో పూజా సామానులు పూర్తిగా దగ్ధమైయ్యాయి. 5నుంచి6 లక్షల వరకు నష్టం వాటిలినట్లు తెలిపారు. పైలా సరోజిని పాన్‌ షాప్‌ ఈమెకు సుమారుగా 30 నుండి 40 వెలు రూపాయలు విలువచేసే కూల్డ్రింక్స్‌ కాలిపోయాయి. పైలా శ్రీనివాసరావు జ్యూస్‌ షాప్‌ ఫ్రిజ్‌, గ్రైండర్స్‌ , పళ్ళు మిఠాయిలు, మిక్సీలు, పూర్తిగా కాలిపోయాయి. రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయలు ఆస్తి నష్టం సంబంధించింది. బెవిరిశెట్టి రత్నం కిరాణా షాప్‌ మీరివి నూనెలు, కిరాణా సామాన్లు, సాల్టు, రకాల పప్పు దినుసులు కాలిపోయాయి. వీళ్ళకి రెండు లక్షలు సామానులు ఆస్తి నష్టం సంబవించినది . సంఘటన స్థలానికి ఫార్మా సిటీ, ఎన్టిపిసి అగ్నిమాపక శకటాలు వచ్చి మంటలను అదుపు చెశాయి. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి ఘటనకు గల కారణాలపై విచారణ చేపట్టారు.