Jul 05,2022 10:47

నిడదవోలు (తూర్పు గోదావరి) : ట్రాన్స్‌ఫార్మర్లు రాజుకొని షాపింగ్‌మాల్‌ దగ్ధమైన ఘటన మంగళవారం నిడదవోలులో చోటుచేసుకుంది. షాపింగ్‌ మాల్‌లో అమర్చిన షట్టర్‌ విద్యుత్తుతో ఓపెన్‌ అయ్యేవిధంగా అమర్చారు. ఈక్రమంలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు రాజుకొని మంటలు అంటుకున్నాయి. షాపింగ్‌మాల్‌ దగ్ధమయ్యింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చర్యలు చేపట్టారు. మాల్‌ షట్టర్‌ రాకపోవడంతో జెసిబి సాయంతో గోడను బద్దలు కొట్టి మంటలను అదుపుచేశారు. అప్పటికే షాపింగ్‌మాల్‌లోని రెండు అంతస్తులు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. భారీ ఆస్తి నష్టం కలిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.