
ప్రజాశక్తి -గుంటూరు : గుంటూరు జిల్లాలోని చేబ్రోలులో ఓప్రవేట్ బ్యాంక్‌లో ఘరానా మోసం ఆలస్యంగా వెలుగు చూసింది. నకిలీ బంగారం తాకట్టు పెట్టి రూ.35 లక్షలు రుణం మంజూరు తీసుకున్నట్లు బ్యాంక్ మేనేజర్ సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంక్‌లో పని చేస్తున్న గోల్డ్ అఫ్రైజర్ అతని కుమారుడు ఈ మోసం చేశారని బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదులో తెలిపారు. బ్యాంక్‌ను మోసం చేసి రాత్రికి రాత్రే మోసగాళ్ళు ఉదాయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.